Thursday, May 9, 2024

Akash Puri | ఫ్యాషన్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఆకాష్ పూరి..

డైరెక్టర్ పూరిజగన్నాథ్ వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఆకాష్ పూరి’ కొత్త అప్‌డేట్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న ఆకాష్ పూరి తాజాగా ఓ పోస్ట్ చేశాడు. RC ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఫ్యాషన్ బ్రాండ్ అయిన RC ట్రెండ్‌సెట్టర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆకాష్ పూరి సంతకం చేశారు. ఆ విషయాన్ని తెలియజేస్తూనే ఆకాష్ పోస్ట్ వేశారు.

కాగా ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తూ 2018లో తెరకెక్కించిన ‘మెహబూబా’ సినిమాని పూరిజగన్నాథ్ డైరెక్ట్ చేశారు. ఆ సినామా తురవాత రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement