Wednesday, May 22, 2024

రుణాలు ఎక్కువ తీసుకోలేదన్న అదానీ గ్రూప్‌.. ప్రభుత్వ బ్యాంక్‌ల నుంచి తగ్గాయని ప్రకటన

అదానీ గ్రూప్‌ రుణ భారం పెరుగుతుందని క్రెడిట్‌సైట్స్‌ ఇచ్చిన నివేదకపై గ్రూప్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. అదానీ గ్రూప్‌ రుణాల భారం ఎక్కవలేదని తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలను సగానికి తగ్గించుకున్నట్లు తెలిపింది. రుణాలకు, ఆపరేటింగ్‌ ఫ్రాఫిట్‌ రేషియోకు మధ్య అంతరం ఎక్కువగా ఉందని క్రిడెట్‌సైట్స్‌ పేర్కొంది. అదానీ గ్రూప్‌ల్లో చాలా సంస్థలు అధిక రుణభారంతో ఉన్నాయని, చివరకు చెల్లింపుల సమస్యతో ఇవి దివాళా తీసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. నికర రుణాలు, ఆపరేటింగ్‌ ఫ్రాఫిట్‌ రేషియో మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. గడిచిన 9 సంవత్సరాల్లో ఈ రేషియో 7.6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గించుకున్నామని వివరణ ఇచ్చింది. కంపెనీ వ్యాపారాలు అన్ని మంచి పురోగతిలో ఉన్నాయని, చాలా వరకు పునరావృతమయ్యే వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా డెవలప్‌మెంట్‌, ఆర్గనైజేషన్‌పై కేంద్రీకరించామని, మేనేజ్‌మెంట్‌ పనితీరు మెరుగ్గా ఉందని, పెట్టుబడుల ప్లాన్‌పై మేనేజ్‌మెంట్‌ కేంద్రీకరించిందని వివరణలో పేర్కొంది.

అదానీ గ్రూప్‌ల మొత్తం రుణాలు మార్చి 2022 నాటికి 1.88 లక్షల కోట్లు ఉన్నాయి. బ్యాలెన్స్‌ షీట్‌ను పరిగణలోకి తీసుకుంటే నికర రుణాలు 1.66 లక్షల కోట్లు ఉందని తెలిపింది. గ్రూప్‌లోని అన్ని సంస్థలు తీసుకున్న రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి 2015-16 సంవత్సరాల్లో 55 శాతంగా ఉన్నాయని, ఇవి 2021-22 నాటికి 21 శాతానికి తగ్గించుకున్నామని అదానీ గ్రూప్‌ వివరణ ఇచ్చింది. అదానీ గ్రూప్‌ రుణాల ఊబీలో ఉందని, కొత్త బిజినెస్‌ల ప్రారంభం, కొనుగోళ్లుకు నిధులు బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలతోనే చేస్తున్నాని క్రిడెట్‌సైట్స్‌ పేర్కొంది. గడిచిన 9 సంవత్సరాల్లో రుణాలకు, నికర పెెరుగుదలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించుకున్నామని తెలిపింది. ఇది ఎంతో మెరుగ్గా ఉందని, పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పేర్కొంది. నగదు నిర్వహణ సామర్ధ్యంతో గత పది సంవత్సరాలుగా కంపెనీ రుణాల తగ్గింపుకోసం పని చేసిందని తెలిపింది. కంపెనీ ఎక్కువ రుణాలను సంస్థలు, బ్యాంక్‌లు, ఈక్విటీ మార్కెట్‌ నుంచి వ్యూహాత్మకంగా సేకరిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement