Friday, May 3, 2024

ఆదానీ పోర్ట్స్‌ లాభంలో 68.5 శాతం వృద్ధి

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ ఈ త్రైమాసికంలో మెరుగైన ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ 1677 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 68.5 శాం పెరిగింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 32.8 శాతం వృద్ధి చెంది 5,210 కోట్లుగా నమోదైంది.

కంపెనీ కార్గో సేవల విభాగంలో 15 శాతం వృద్ది నమోదుతో 86.6 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరింది. ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగంలో 200 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మైలురాయిని చేరుకున్నామని ఏపీ సెజ్‌ సీఈఓ కరణ్‌ అదానీ తెలిపారు. ఈ ఏడాదిలో నే 350-360 మెట్రిక్‌ టన్నుల మైలురాయిని చేరుకుంటామని అంచనా వేసినట్లు తెలిపార. అదానీ పో ర్ట్స్‌కు దేశ వ్యాప్తంగా పోర్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టును సొంతం చేసుకోవడం ద్వారా అదానీ గ్రూప్‌లో ఉన్న పోర్టుల సంఖ్య 12కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement