Thursday, May 23, 2024

దేశంలో 40 శాతం మందికే ఉద్యోగాలు.. తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఆనంద్‌ మహీంద్రా

దేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఇంతకాలం చైనాపై ఆధారపడిన దేశాలు ప్రస్తుతం భారత్‌ వైపు చూస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు మన దేశానికి అనుకూలంగా ఉన్నాయని, వీటిని అందిపుచ్చుకోవాలంటే ఉన్న కొన్ని లోపాలను సరిచేసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో నిరుద్యోగ సమస్య చాలా ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ లెక్కల ప్రకారం మన దేశంలో నిరుద్యోగిత 7-8 శాతానికి చేరింది. జీడీపీ వృద్ధి చెందినంత వేగంగా ఉద్యోగాలు వృద్ధి చెందడంలేదని ఆయన చెప్పారు. పని చేయగల, పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని దొరుకుందన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనంద్‌ మహీంద్రా చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మన దేశంలో ఉద్యోగాభివృద్ధి జరగపోతే సామాజిక అశాంతికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులను ఊహించలేమన్నారు. ప్రభుత్వం కొంత కృషి చేస్తున్నా, ఇంకా జరగాల్సింది ఎంతో ఉందన్నారు.

కేంద్రం ప్రభుత్వంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. ఆయన దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారు. ఉబర్‌ డ్రైవర్లు, జొమాటో డెలివరీ బాయ్స్‌ రూపంలో గిగ్‌ ఎకానమీలోనే ఉద్యోగాల సృష్టి ఎక్కువగా జరుగుతుందన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదని, స్థిరమైన ఉద్యోగాల కల్పన జరగాల్సి ఉందన్నారు. పెద్ద సం ఖ్యలో ఉద్యోగాల సృష్టి జరగాలంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఎంస్‌ఎంఈలను ప్రోత్సహిస్తే స్థానికంగానే ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement