Sunday, April 28, 2024

YSRCP అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా

తాడేపల్లి – వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. వైసీపీ ఇంఛార్జిల మార్పుల చేర్పులకు సంబంధించి మూడో లిస్టు ప్రకటనను వాయిదా వేసింది వైసీపీ అధిష్టానం.

మరికొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో లిస్టు విడుదలను వాయిదా వేశారు. రేపు లేదా ఎల్లుండి వైసీపీ మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా.. మూడో జాబితాలో 14 స్థానాల్లో సీఎం జగన్ మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి. మూడో లిస్టును సీఎం జగన్ ఫైనల్ చేసేశారని, కాసేపట్లో ఆ జాబితాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో జాబితా ప్రకటనను వాయిదా వేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement