Saturday, April 27, 2024

పోలవరం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం!

పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీల సమావేశం అయ్యారు. అరగంటకు పైగా సాగిన సమావేశం సాగింది. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం సహా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని వైసీపీ ఎంపీలు కోరారు. ఈ సందర్భంగా సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన రూ.47,725 కోట్ల మేరకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ అంగీకరించారు. ఈ క్రమంలో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. వచ్చేవారం కేంద్ర కేబినెట్‌ ముందుకు పోలవరం సవరించిన అంచనాల అంశం రానుంది.

కేంద్ర మంత్రితో భేటీ అనంతరం వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలని, ఎటువంటి షరతులు లేకుండా నిధులు రీయింబర్స్‌మెంట్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఐదు అంశాలపై కేంద్రమంత్రి షెకావత్‌తో చర్చించినట్లు చెప్పారు.  పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడులను క్లియర్ చేయడం.. సవరించిన అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిందని చెప్పారు. రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరామని, అయితే, కమిటీ సూచించిన మేరకు రూ.47,725 కోట్లు ఆమోదిస్తామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement