Sunday, April 28, 2024

YSRCP – జనంతో జగన్ మమేకం … దారి పొడవునా నీరాజనం

రైతులతో మాటామంతి
అనారోగ్య మహిళకు ఓదార్పు
నాయకులతో సుదీర్ఘమంతనాలు

అనంతపురం, ఏప్రిల్ 1(ప్రభ న్యూస్ బ్యూరో) – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనంతో మమేకమైపోయారు. ఐదవ రోజు సిద్ధం బస్ యాత్ర బత్తలపల్లి శివారు నుంచి ప్రారంభమైంది. ఆదివారం ఈస్టర్ పండుగ కావడంతో విరామం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో ప్రత్యేక ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టిడిపి కి సంబంధించిన నాయకులు కార్యకర్తలను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. విభేదాలు ఉన్న నియోజకవర్గంలో నాయకులను సమన్వయపరిచారు.

ఉదయం 10:45 గంటలకు మిడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభమైంది. దారిలో అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలితో ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం గురించి అధికారులను పురమాయించారు. దారిలో రైతు కూలీలు మహిళలతో మాట్లాడారు. మహిళా రైతు వేరుశనగ పంటను సీఎంకు చూపించారు.

11.20 గంటలకు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో బత్తల పల్లి చేరుకున్న జగన్ 12 గంటల వరకు సుమారు 40 నిమిషాలు పాటు అక్కడే ఉండి ప్రజలకు అభివాదం చేశారు. పొటెత్తిన జనం పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. రెండు చోట్ల భారీ గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. స్థానిక నాయకులు గొర్రె పిల్లను ముఖ్యమంత్రికి బహుకరించారు. అశేష జనం మధ్య బస్సు యాత్ర ముందుకు సాగింది. రామాపురం, ముదిగుబ్బ, మలక వేమల క్రాస్, పట్నం గ్రామాల మీదుగా రాత్రికి కదిరికి చేరుకుంటారు. సాయంత్రం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొంటారు. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్బాషా పార్టీలో చేరుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement