Friday, May 3, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో ఫ్యాన్ జోరు – అయిదు స్థానాలు ఏక‌గ్రీవం..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అధికార వైసీపీ హవా కొనసాగుతూ వస్తోంది. గత ఏడాది స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో కూడా ఫ్యాన్‌ హవా కొనసాగుతోంది. తొమ్మిది స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నిక ల్లో ఐదు స్థానాలను అధికార వైసీపీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. దీంతో మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి మార్చి 13వ తేదీ ఎన్నికలు జరగను న్నాయి. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆయా పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్ధులు అత్యధిక సంఖ్యలో పోటీలో నిలవగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తొమ్మిది జిల్లాల పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నుండి పెద్దగా పోటీ లేనప్పటికీ కొంత మంది సీనియర్‌ నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఐదు స్థానాలు ఏకగ్రీవం కాగా నాలుగు స్థానాలకు సంబంధించి స్వంతంత్ర అభ్యర్ధులు పోటీలో నిలవడంతో ఆయా జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ జోరు మరోసారి స్పష్టంగా కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement