Saturday, April 27, 2024

అమ‌రావ‌తి ఉద్యమంలోకి ‘ఆ న‌లుగురు’…

అమరావతి, ఆంధ్రప్రభ: ఎమ్మె ల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారంటూ వైసీ పీ నుండి సస్పెన్షన్‌కు గురైన ఆ నలుగురు ఎమ్మెల్యేలు కొత్త వ్యూహంతో ముందుకు రాబోతు న్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు మరో ఏడాది కాలం మాత్రమే ఉం డడంతో అమరావతి రాజధాని అంశం కూడా ఒక ప్రధాన అజెం డాగా ముందుకు రానుంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు అమరావ తి రాజధాని అంశాన్ని తమ ప్రచా ర అస్త్రంగా వాడుకోవాలని భావి స్తున్నట్లు తెలుస్తోంది. అనేక రకా ల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగ డుతూనే అమరావతి రాజధాన్ని అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిం చాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశా రని ఎమ్మెల్యేలు ఆనం రామ నారాయణరెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ నుండి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా టిడిపికి అమ్ముడుపోయారంటూ వైసిపి నేతలు ఆరోపించారు. దీనిపై ఆ నలుగురు ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. తాము ఆత్మ ప్రబోధనుసారం ఓటేశామేకానీ అమ్ముడుపోవాల్సిన అవసరం లేదని గట్టిగా కౌంటరిచ్చారు. అమ్ముడుపోయారంటూ తమను అమమానపరుస్తున్న వైసిపిని టార్గెట్‌ చేసేందుకు అమరావతి అంశాన్ని ప్రధానంగా తెర మీదకు తేవాలని భావిస్తున్నారు.

అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం
అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవ లి ్ల శ్రీదేవి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ ఇప్పటికే అమరావతి రైతుల పక్షాన నిలబడతాననని చెప్పారు. ఎన్నికలకు ముందు గడప గడపకు తిరుగుతూ రాజధాని ఇక్కడే ఉంటుందని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అందరికీ వినిపించా మని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారంటూ విమర్శలు గుప్పిసు ్తన్నారు. రానున్న కాలంలో అమరావతి రైతులతో కలిసి ఉద్యమిస్తానని చెప్పారు. ఇక కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి గతంలోనే అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి రైతులు తిరుపతికి యాత్రగా వెళ్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలోని తన నియోజకవర్గంలో వారికి వసతి ఏర్పాట్లు చేశారు. అప్పుడే అమరావతి రైతుల పక్షాన నిలబడిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పుడు మరింతగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా అమరావతికి అనుకూలంగా వ్యవహరించబోతున్నారని సమాచారం. వీరిద్దరితోపాటు ఆనం, మేకపాటి కూడా అమరావతిపై గట్టిగా వాయిస్‌ను వినపించబోతున్నారు. ముఖ్యంగా ఆనాడు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని, ఆ హామీ ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులను, అధికారంలోకి వచ్చిన తర్వాత వైఖరి మార్చుకోవడానికి గల కారణాలను, మారిన వైఖరి తో వైసిపిలోనే ఉన్న అసంతృప్తిని వీరంతా ప్రజల ముందు వివరించనున్నారు.

ఉప ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం
అమరావతా, మూడు రాజధానులా అనేది అధికార, ప్రతిపక్షం మధ్య ఎప్పుడూ సవాళ్లు, ప్రతి సవాళ్ల గానే ఉంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తారనే ప్రచారం మొదలైంది. త ద్వారా అమరావతికే ప్రజలు పట్టం కడతారని నిరూపించాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికల్లో తాడి కొండ సీటును గెలిస్తే అమరావతి రాజధాని అజెండాకు మంచి ఊపు వస్తుందనే భావనలో టిడిపి ఉందనే ప్రచారమూ జరగుతోంది. అయితే ఇదంతా ప్రచారానికే పరిమితంగా ఉంది. ఎన్నికలు మరో ఏడాది ఉండగా పట్టభద్రుల ఎన్నికలు, ఎమ్మెల్సీల ఎమ్మెల్యేల ఎన్నికల్లో విజయంతో టిడిపి క్యాడేర్‌ మంచి ఉత్సాహాం వచ్చింది. ఇది ఎన్నికల వరకు పని చేస్తుందని, మళ్లి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన అసవరం లేదని టిడిపిలో ఒక వర్గం భావిస్తోంది. ఏది ఏమైనా ఈ నలుగురు ఎమ్మెల్యేలు రానున్న కాలంలో ప్రభుత్వానికి ఏ స్థాయిలో ఇరకాటంగా మారతారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement