Monday, October 7, 2024

మందుపాత‌ర పేలి.. మృతి చెందిన ఏసిపి

మావోయిస్టుల కోసం గాలిస్తున్న క్ర‌మంలో ఏసిపి మందుపాత‌ర‌పై కాలు పెట్ట‌డంతో ఒక్క‌సారిగా భారీ పేలుడు సంభ‌వించింది. దాంతో ఆయ‌న అక్క‌డిక్క‌డే మృతి చెందారు. సాయుధ బలగాలే టార్గెట్ గా మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు(మందుపాతర) పేలి ఏసిపి మృతిచెందిన ఘటన చత్తీస్ ఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది. భస్తర్ జిల్లాలోని తిమినార్ క్యాంప్ నుండి అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ విజయ్ యాదవ్(40) నేతృత్వంలో సాయుధ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ కు వెళ్లారు. ఎటపాల్ రహదారి మార్గంంలో గాలింపు చేపడుతుండగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై విజయ్ కాలుపెట్టడంతో ఒక్కసారిగా పేలాయి. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయుధ బలగాల సమాచారం అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు ఏసిపి మృతదేహాన్ని అక్కడినుండి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లా రాజ్ పూర్ కు తరలించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఏసిపి మృతిపట్ల సాయుధ బలగాల అధికారులతో పాటు స్థానిక పోలీసులు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement