Friday, May 3, 2024

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు..

కర్నూలు, (ప్రభ న్యూస్‌): రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట వేసి వారి సంక్షేమానికి ప్రత్యేక కృషిచేస్తుందని నగర మేయర్‌ బి.వై. రామయ్య అన్నారు. నిన్న కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశాఖ డీడీ శ్యామలమ్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి రెవెన్యూ జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌ఓ పుల్లయ్యలు మాట్లాడుతూ, ప్రభుత్వం పిఎంఎంఎస్‌వై స్కీం కింద అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు.

అంతకుముందు జ్యోతిప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యశాఖ డీడీ మాట్లాడుతూ, జిల్లాలో మత్స్యశాఖ యంత్రాంగానికి అనేక సంక్షేమ ఫలాలు అందించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మేయర్‌ మాట్లాడుతూ పీఎంఎంఎస్‌వై స్కీం కింద హబ్‌లు, మినీ ఫిష్‌ వెండింగ్‌ యూనిట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు, పలువురు అధికారులు, ఎఫ్‌డిఓలు, ఏఐఎఫ్‌లు, వీఎఫ్‌ఏలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement