Tuesday, April 23, 2024

యధేచ్చగా అక్రమ క్వారీలు రాత్రిపూట బ్లాస్టింగ్‌లు..


పార్వతీపురం, (ప్రభ న్యూస్‌) : నిబంధనలకు నీళ్లు వదిలి యధేచ్చగా అక్రమ క్వారీలు నడిపిస్తూ రాత్రి పూట బ్లాస్టింగ్‌ చేపడుతున్నారు. అక్రమార్కులకు అడ్డాగా అక్రమ క్వారీల నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మండలం బాలగూడబ, పెద్దగొడవ ఏరియాల్లో రాత్రి వేళ్ల అక్రమార్కులు అధికారులు కళ్ల కప్పి జెలిటెన్‌ స్టిక్స్‌ ఉపయోగించి బాంబు బ్లాస్టింగ్‌లు చేపడుతున్నారు. ప్రభుత్వం నూతన నిబంధనల మేరకు క్వారీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా భవన నిర్మాణాలు, అభివృద్ధి పనులు ఆగకుండా ఉండేందుకు లక్ష్యంగా కొంతమేర రెన్యూవల్‌కు వెసులుబాటు కల్పించింది. ఇదే అదునుగా అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేపడుతున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. బ్లాస్టింగ్‌ చేసిన ప్రాంతాల్లో రాయిని పట్టపగలే యంత్రాల సహాయంతో రాళ్లను ముక్కలు చేసి ట్రిప్పర్లు, ట్రాక్టర్లు సహాయంతో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న స్టోన్‌ క్రషర్లకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు స్టోన్‌క్రషర్‌ల యజమానులే అక్రమ క్వారీలను పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మైనింగ్‌ , పోలీస్‌, రెవెన్యూ అధికారులు నిద్రావస్థల్లో ఉన్నారు. మైనింగ్‌ ఏడీ రవికుమార్‌ ను వివరణ కోరగా, ఎవరికి ఎలాంటి బ్లాస్టింగ్‌ అనుమతులు ఉండదనే బ్లాస్టింగ్‌లపై పోలీసులు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. తాను పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement