Thursday, May 2, 2024

సంపద తయారీ కేంద్రాల‌తో ఇలా చేయండి..: జిల్లా ప‌రిష‌త్ సీఈవో

గంపలగూడెం: చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుందని , ఆ ఆదాయంతో గ్రామాల్లో మౌలిక సదుపాయల రూపకల్పనకు కృషి చేయాలని కృష్ణా జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆయన గురువారం మండలంలోని వినగడప,గోసవీడు,చింతలనర్వ గ్రామాల్లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు ప్రతి ఇంటి నుండి తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా సేకరించి ఆ చెత్త ద్వారా ఎరువు తయారు చేయాలని సూచించారు. ఆ ఎరువు గురించి రైతులకు వివరించి వారు వినియోగించుకునేలా చేయాలని పేర్కొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శుల నుండి ఆరా తీశారు. ఆయ‌న వెంట ఎంపీడీవో పిచ్చిరెడ్డి, పంచాయతీ విస్తరణ అధికారి బాబూరావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement