Monday, May 6, 2024

స్ట‌న్నింగ్ లుక్స్ లో ప్రిన్స్ మ‌హేష్‌.. స‌ర్కారు వారి పాట నుంచి పోస్ట‌ర్ రిలీజ్..

సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు తదుపరి సినిమా సర్కారు వారి పాట టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా ఉండ‌బోతోంది. 14 రీల్స్ ప్లస్ మహేష్ బాబు సొంత బ్యాన‌ర్ అయిన GMB ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ డ్రామా మూవీ ఇది. ఈ సినిమా మొదటి సింగిల్ తర్వాత, పెన్నీ అనే రెండవ సింగిల్ మార్చి 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి ఈ రోజు మేకర్స్ మహేష్ బాబు కొత్త పోస్టర్‌ను షేర్ చ‌సుకున్నారు. దీనికి సంబంధించి మూవీ యూనిట్ తమ సోష‌ల్ అకౌంట్స్ లో “A song worth every Penny #PennySong from #SarkaruVaariPaata will be credited to your playlist on 20th March ” అని రాశారు.

దీంతో మహేష్ బాబు సర్కార్ వారి పాట ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా మారింది. ఇటీవల స్పెయిన్‌లో ఒక పాట, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం, ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ను రోల్ చేస్తోంది. థమన్ సౌండ్‌ట్రాక్‌లను అందిచ‌గా.. మొదటి సింగిల్ కళావతి సాంగ్ వ్యూస్ ప‌రంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఇది అతి త్వరలో 100 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉంది. మొదటి పాట ఇంత పెద్ద హిట్ కావడంతో, మరో 3 రోజుల్లో వచ్చే రెండో సింగిల్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement