Thursday, April 25, 2024

త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ట్యాంక‌ర్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్‌.. రంగంలోకి ఫైర్ సిబ్బంది

ఏలూరు జిల్లా రామ‌చంద్ర ఇంజ‌నీరింగ్ కాలేజీ ద‌గ్గ‌ర ఓ ట్యాంక‌ర్ నుంచి యాసిడ్ లీక్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిర ఫైర్ సిబ్బంది ప‌రిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా హైవేపై ఓ ట్యాంక‌ర్ నుంచి యాసిడ్ లీక్ అయ్యింది. ఈ ట్యాంక‌ర్ లో దాదాపు 20 ట‌న్నుల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్న‌ట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. యాసిడ్ లీక్ అవుతుండ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఫైర్‌ సిబ్బంది ట్యాంక‌ర్ చుట్టూ ఇసుక వేశారు. మొత్తం మీద యాసిడ్ లీక్ ను అదుపులోకి తీసుకురావ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని అధికారులతోపాటు స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement