Tuesday, March 26, 2024

పోలీస్ ఆఫీసర్ గా అడివి శేషు.. హిట్2టీజర్ రిలీజ్

విభిన్న కథలతో దూసుకుపోతున్నాడు హీరో అడివి శేషు.ఆయన నటిస్తోన్న తాజా చిత్రం హిట్ 2. అడివి శేష్ జోడీగా మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. అడివి శేష్ పైఅధికారిగా ఆయన కనిపించనున్నారు. జాన్ స్టీవర్ట్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ను బట్టి చూస్తే, పోలీస్ ఆఫీసర్ గా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లో అడివి శేష్ కనిపిస్తున్నారు. ఎవరు ఎంతగా కంగారు పడుతున్నా, కూల్ గా తాను చేయదలచుకున్న పనిని చేసే పాత్రలో అడివి శేష్ కొత్తగా అనిపిస్తున్నారు. ఒక యువతి మర్డర్ కేసును పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ ఎలా ఛేదించాడు అనేదే కథ. సరిగ్గా ఆ పాయింటు పైనే టీజర్ ను కట్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement