Thursday, April 18, 2024

Munugode Bypoll : నాంప‌ల్లిలో రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు ప‌ట్టివేత‌..

మునుగోడులో న‌గ‌దు ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది.. ఓటింగ్ రోజు కూడా ఆగ‌డం లేదంటే ఏ మేర సాగుతుంతో అర్ధం చేసుకోవ‌చ్చు. న‌ల్ల‌గొండ జిల్లా నాంప‌ల్లి మండ‌లం మ‌ల్ల‌పురాజిప‌ల్లిలో పోలీసులు భారీగా న‌గ‌దును ప‌ట్టుకున్నారు. రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దును కారులో త‌ర‌లిస్తుండ‌గా పోలీసుల సోదాలు నిర్వ‌హించి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా డ‌బ్బు ఎవ‌రిది అనేదానిపై రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement