Monday, May 6, 2024

పెరుగుతున్న గోదావరి ఉధృతి.. మొదటి హెచ్చరిక జారీ

ఎటపాక : భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతున్నది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా సాగుతున్నది. గురువారం ఉదయం 8.00 గంటలకు 39.5 అడుగులున్న గోదావరి.. క్రమ క్రమంగా పెరుగుతూ సాయంత్రం 6.00 గంటలకు 43.30 చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నిమగ్నం మయ్యారు.

ఎటపాక మండలం లోని నెల్లి పాక రోడ్డు పైకి వరద నీరు వీరయి గూడెం నెల్లిపాక కు కన్నయిగూడెం రోడ్డు పై వరద నీరు చేరడంతో గట్టుగూడెం, కన్నయిగూడెం మధ్య రాక పోకలు నిలిచాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతుండటంతో లోతట్టు కాలనీ వాసులు, ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement