Saturday, November 26, 2022

Breaking: అక్వా కల్చర్ లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ .. జగన్

అక్వా కల్చర్ లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆక్వా వర్శిటీ, బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్, రూ.1400కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు సీఎం శంకు స్థాపన చేశారు.

- Advertisement -
   

ఈసందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… దేశంలో ఫిషరీస్ యూనివర్సిటీలు రెండే ఉన్నాయన్నారు. దేశంలో మూడో అక్వా వర్సిటీ మనదని అన్నారు. రూ.332 కోట్ల వ్యయంతో దీన్ని నరసాపురంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.430కోట్లతో బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement