Saturday, May 18, 2024

తెలంగాణ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు విశాఖ ఉక్కు కర్మాగారం నడపడం కోసం ముడి సరుకు, వర్కింగ్ క్యాపిటల్ కొరకు చ‌ర్చించేందుకు వ‌చ్చిన‌ సింగరేణి బొగ్గు గనుల అధికార ప్రతినిధులను స్వాగతిస్తున్నామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. సింగ‌రేణి ప్రతినిధుల బృందాన్ని విశాఖ పరిపాలన భవనం లో సిఎండి సమావేశ మందిరంలో కలసి ప్రజల సంపద ప్రజలకే చెందే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షనీయమని వారు తెలియజేశారు. దీనిలో అటు యాజమాన్యం నుంచి గాని, యూనియన్ ప్రతినిధుల నుంచి గాని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా త‌మ‌ వంతుగా కృషి చేస్తామని క‌మిటీ కార్య‌ద‌ర్శి వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావాలని వారు కోరారు. సింగ‌రేణి బృందాన్ని క‌లిసిన వారిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, జె అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, వై మస్తానప్ప, సిహెచ్ సన్యాసిరావు, వరసాల శ్రీనివాస్ , పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఉన్నారు.


కాగా, సింగరేణి కాలరీస్ నుంచి డైరెక్టర్ సత్యనారాయణ రావు, సుబ్బారావు, బలరామ్ మరో ఇద్దరు జనరల్ మేనేజర్ నేడు విశాఖ ఉక్కు పరిపాలన భవనంలో మార్కెటింగ్ అధికారులతో చర్చించారు. అనంతరం సీఎండీ సమావేశ మందిరంలో విశాఖ ఉక్కు కర్మాగారం డైరెక్టర్స్ అయినా వేణుగోపాలరావు , భగీచి , మహంతి ల‌తో చర్చించారు. ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వివిధ అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement