Sunday, April 28, 2024

Vizianagaram – గ‌జ‌ప‌తి న‌గ‌రం సివిల్ కోర్టులో చంద్ర‌బాబు ప్ర‌మాణం

ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌మాణ ప‌త్రం అంద‌జేత
విజ‌య‌న‌గ‌రంలో అల‌క నేత‌ల‌తో బాబు భేటీ
బుజ్జ‌గింపులు స‌క్సెస్.. క‌లిసి ప‌ని చేస్తామ‌న్న కిమిడి నాగార్జున

విజయనగరం : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గజపతినగరం సివిల్‌ జడ్జి కోర్టులో నేడు ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం జడ్జి ఎదుట అఫిడవిట్‌తో చంద్రబాబు ప్రమాణం చేశారు. ఇది ఇలా ఉంటే కుప్పం టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు తరఫున ఈ నెల 19న ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరి తరఫున మరొకరు నామినేషన్లు దాఖలు చేస్తే రాష్ట్రంలో ఏ సివిల్ జడ్జి ముందు హాజ‌రై నామినేషన్ పత్రాలు సమర్పించి.. ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు ఇప్పుడు ప్రమాణం చేశారు.

- Advertisement -

అల‌క నేత‌ల‌కు బుజ్జ‌గింపులు..
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 18 నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మరికొన్ని స్థానాల్లో మార్పులు, చేర్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక చంద్రబాబు విజయనగరం పర్యటనకు రావడంతో రసవత్తరంగా రాజకీయం మారింది. తమకు టిక్కెట్లు రాలేదని అలకబూని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేతలతో చంద్ర‌బాబు కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడుతో బాబు చర్చించారు. సుమారు అరగంటపాటు అసంతృప్తులతో జరిగిన ఈ చర్చలు ఫలించాయి. అనంతరం బొండపల్లిలో మహిళా సదస్సుకు కిమిడి, నాయుడు ఇద్దరూ హాజరయ్యారు. టీడీపీ కూట‌మి అభ్య‌ర్ధుల విజ‌యానికి కృషి చేస్తామ‌ని ఆ నేత‌లు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement