Monday, April 29, 2024

Big Breaking | విశాఖను విద్రోహ సెంటర్​ చేశారు.. జగన్​ పాలనలో అంతా అవినీతే: అమిత్​షా

ఏపీలో విశాఖను విద్రోహులకు సెంటర్​గా మార్చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్​షా మండిపడ్డారు. జగన్​ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శలు గుప్పించారు. సింహాచలం లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అవినీతి తప్ప, జగన్​ ప్రభుత్వం ఏమీ చేయలేదని విరుచుకుపడ్డారు అమిత్​షా. రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. రైతు ఆత్మహత్య విషయంలో జగన్​ సిగ్గుపడాలన్నారు. ప్రధాని మోదీ ఇస్తున్న నిధులను రైతు భరోసా పేరుతో తానే ఇస్తున్నట్టు జగన్​ మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. 

కేంద్ర పథకాలకు జగన్​ ఫొటోలు..

- Advertisement -

కేంద్రం ఇచ్చిన బియ్యానే పేదలకు పంచుతున్నారు కానీ, కేంద్ర పథకాలకు తన ఫొటో వేసుకుంటున్నాడని అమిత్​షా అన్నారు. విశాఖను విద్రోహ శక్తులకు అడ్డాగా మార్చారని, కేంద్ర ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్​ చెప్పాలన్నారు.  ఏపీలో అధికార పార్టీ నేతలు భూ కబ్జాలు చేస్తున్నారని, మైనింగ్​, ఫార్మా స్కామ్​లు జరుగుతున్నాయన్నారు.

ఏపీలో 20 ఎంపీ సీట్లు ఇవ్వాలి..

తొమ్మిదేండ్లలో ఏపీ కోసం ప్రధాని మోదీ అనేక పనులు చేశారని, ఇప్పటివరకు ఏపీకి కేంద్ర పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు అమిత్​షా. ‘‘జగన్​ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏపీకి రెండు వందే భారత్​ రైళ్లను ఇచ్చాం. రూ.450 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్​ అభివృద్ధి చేస్తున్నాం. కడప ఎయిర్​పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలులో కొత్త ఎయిర్​పోర్టును ప్రారంభించాం. భోగాపురం ఎయిర్​పోర్టుకు అనుమతి ఇచ్చాం. కాకినాడ, విశాఖ, తిరుపతి, అమరావతిని స్మార్ట్​ సిటీలుగా కేంద్రం అభివృద్ధి చేస్తోంది. అనేక కేంద్ర విద్యాసంస్థలు పెడుతున్నాం. అందుకని 2024లో జరిగే జనరల్​ ఎలక్షన్స్​లో ఏపీ నుంచి 20 సీట్లలో బీజేపీని గెలిపించాలని అమిత్​షా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement