Tuesday, May 7, 2024

విశాఖ ఉక్కు చరిత్రలో తొలిసారి – నాలుగు నెల‌లో రూ.740 కోట్ల నిక‌ర లాభం

విశాఖ‌ప‌ట్నం – ప్రైవేటీక‌ర‌ణ వైపు ప‌రుగులు తీస్తున్న కేంద్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ షాక్ ఇచ్చారు…న‌ష్టాల‌లో న‌డుస్తున్న‌దంటూ పాట పాడుతున్న కేంద్రానికి అది అస‌త్య‌మంటూ ఈ ఏడాది లావాదేవీల వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఏకంగా రూ.740 కోట్ల నిక‌ర లాభం ఆర్జించిన‌ట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి పి కె ర‌థ్ ప్ర‌క‌టించారు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో  విశాఖ స్టీల్ ప్లాంట్ రూ. 18 వేల కోట్ల అమ్మకాల టర్నోవర్‌ను నమోదు చేసిందని ఆయ‌న‌ తెలిపారు. ఆర్ధిక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సీనియర్ అధికార్లతో  ఆయన వర్చువల్ విధానంలో పరిస్థితిని సమీక్షించారు. ఈ సంద‌ర్భం గా ఆయ‌న మాట్లాడుతూ, విశాఖ ఉక్కు అమ్మకాల టర్నోవర్లలో ఇది రెండో అత్యధికమని సీఎండీ చెప్పారు. ‘‘13 శాతం వృద్ధి నమోదు చేశాం. గత నాలుగు నెలల్లో  రూ. 740 కోట్ల నికర లాభం నమోదు చేశాం. మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కును ₹3,300 కోట్లకు విక్రయించాం. కర్మాగారం చరిత్రలో ఇది తొలిసారి’’ అని సీఎండీ రధ్‌ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement