Saturday, April 27, 2024

Fire: అగ్నికి ఆహుతైన కారు.. తప్పిన ప్రాణనష్టం

ఉన్నట్టుండి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పూర్తిగా అగ్నికి ఆహుతైన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకోజిపాలెం మెడికవర్ హాస్పిటల్ దగ్గరలో హైవే మీద ఒక వాహనం అగ్నికి ఆహుతి అయ్యింది. అయితే ఇందులో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. ఆ వాహనం కాలిపోవడంతో హనుమంతవాక్ దగ్గర నుండి ఇసకతోట జక్షన్ వరకూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement