Tuesday, October 19, 2021

జనం డబ్బుతో జల్సాలు.. గ్రామ వాలంటీర్ నిర్వాకం

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ వ్యవస్థను.. కొంత మంది మాత్రం దాన్ని అభాసుపాలు చేస్తున్నారు. తమదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. జనం వద్ద నుంచి ఇష్టారాజ్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. అక్రమంగా వసూలు చేసిన ఆ డబ్బుతో జోరుగా పేకాట ఆడుతూ జల్సా చేస్తున్నాడు. బుచ్చిరెడ్డి పాళెం మండలం, వడ్డిపాళెంలో వాలంటీర్ మల్లి వంశీ ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. దీంతో విసుగు చెందిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News