Thursday, November 7, 2024

విజ‌య‌వాడ ప్ర‌సాదంపాడులో
భారీగా మొహ‌రించిన పోలీసు బ‌ల‌గాలు

కృష్ణా: విజ‌య‌వాడ రూర‌ల్ ప్రాంతం ప్ర‌సాదంపాడులో పోలీసు బ‌ల‌గాలు భారీ ఎత్తున మొహ‌రించాయి. వెస్టు గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవ‌ల డిమాండ్ చేస్తూ… ప్ర‌సాదంపాడు ఎక్సైజ్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించాల‌ని టీడీపీ శ్రేణులు త‌లంచాయి. స్థానిక ఏక్సైజ్ కార్యాలయాన్ని నేతలు చుట్టు ముడతారన్న సమాచారంతో దాన్ని నివారించాల‌నుకున్న పోలీసులు భారీగా ఎక్సైజ్ కార్యాల‌యం వ‌ద్దకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ నాయ‌కులు నాటుసారా బాధిత 42 కుటుంబాల‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ హర్షవర్ధన్ రాజ్ ఆధ్వర్యంలో సుమారు 200మంది పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement