Tuesday, May 7, 2024

Veg Gold – మ‌ద‌న‌ప‌ల్లిలో ట‌మోటా @ 208

మ‌ద‌న‌ప‌ల్లి – ఆంధ్రప్రదేశ్‌లో టమోటాకు పెట్టినపేరైన మదనపల్లె మార్కెట్‌లో కొత్త రికార్డు సృష్టించింది టమోటా.. 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు రైతులు, వ్యాపారులు.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో ఏకంగా కిలో టమోటా ధర డబుల్‌ సెంచరీ దాటేసింది.. ఈ రోజు కిలో టమోటా ధర 208 రూపాయలుగా పలికింది..

ఇక, 25 కేజీల టమోటా బాక్స్‌ ధర 5200 రూపాయిలు పలికింది.. మరోవైపు సాధారణ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.230 నుండి రూ.250 వరకు పలుకుతోంది.. మొత్తంగా 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నయా రికార్డులను సృష్టించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement