Monday, May 20, 2024

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సలహాదారుడిగా డాక్టర్‌ వాసుదేవరెడ్డి

అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్. వాసుదేవరెడ్డి ఆర్. నలిపిరెడ్డిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఎన్.ఆర్.ఐ మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు, చిన్న పిల్లల జబ్బుల నివారణకు డాక్టర్ వాసుదేవరెడ్డి కృషి చేయనున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement