Friday, December 6, 2024

West Godavari: విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మోళ్లపర్రులో విద్యుత్ వైర్లు తెగిపడడంతో వాటిని చూసుకోకుండా తగలడంతో ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్ తో చనిపోయారు. విద్యుత్ షాక్ తో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు నారాయణమూర్తి, వెంకటేశ్వర్లు గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement