Tuesday, November 28, 2023

AP: ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి..

శ్రీకాకుళం జిల్లా మందస మండలం గౌడ గురంటిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ మందస మండలం కొశమాల నుంచి ఒడిశాలోని చీకటి పేటకు ట్రాక్టర్ పై సుమారు 30 మంది గిరిజనులు బీజేపీ సమావేశానికి వెళ్తుండగా.. గౌడ గురంటి గ్రామం దగ్గర ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. మరో 15మందికి గాయాలయ్యాయి.

- Advertisement -
   


మృతులు కొశమాలకు చెందిన సవర డెహరా (61) సవర జగన్నాథ్ (55) లు గా పోలీసులు గుర్తించారు. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement