Sunday, May 5, 2024

ఎగువ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమ ఎడారే – తులసి రెడ్డి

శ్రీశైలం ప్రభ న్యూస్..- శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు నర్రేడ్డి తులసి రెడ్డి. అనంతరం ఆయన శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు.అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎగువ రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర నది మీద ఎగువ భద్ర ప్రాజెక్టును నిర్మిస్తే దిగువ ప్రాంతమైన రాయలసీమ ఎడారి అవుతుందని రాజ్యసభ మాజీ సభ్యుదు, కాంగ్రెస్రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. గురువారం శ్రీశైలంలో మీడియాతో మాట్లాడుతూ తుంగభద్ర నది రాయలసీమకు జీవనాడి అన్నారు. తుంగభద్రా నది లో ఏడాదికి 416 T.M.C.ల నికర జలాలు ఉంటాయని, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. ఇందులో 290 T.M.C.లు కర్ణాటకకు, 126 T.M.C.లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది.
కర్ణాటక రాష్ట్రం తనకు కేటాయించిన 290 T.M.C.లను ప్రాజెక్టులు నిర్మించి ఇప్పటికే పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ ఉందన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నికర జలాలు ఆధారంగా రాయలసీమకు ఉపయోగపడే విధంగా 29.50T.M.C.ల సామర్థ్యంతో తుంగభద్ర లో లెవెల్ కెనాల్ (L.L.C), 32.50 T.M.C. ల సామర్ధ్యంతో తుంగభద్ర హై లెవెల్ కెనాల్ (H.L.C), 39.90 T.M.C.లతో K.C. కెనాల్ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి అని ఆయన తెలిపారు. పై మూడు ప్రాజెక్టుల క్రింద దాదాపు 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.
ఇప్పటికే పై ప్రాజెక్టులకు కేటాయించిన మేరకు నీరు అందడం లేదు 126T.M.C. లకు 2018-19లో 43T.M.C.లు, 2019-20లో 35T.M.C.లు, 2020-21లో 53 T.M.C.ల నీరు మాత్రమే వచ్చిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో నికర జలాల కేటాయింపు లేకుండానే కర్ణాటక ప్రభుత్వం 29.50 T.M.C. ల సామర్ధ్యంతో 6 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా ఎగువ భద్ర ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు.


ఈ సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 2023-24 కేంద్ర బడ్జెట్లో Rs.5300/- కోట్లు కేటాయించింది ఈ ప్రాజెక్టు పూర్తయితే దిగువ రాయలసీమలో ఉన్న L.L.C., H.L.C., K.C. కెనాల్ ప్రాజెక్టులకు చుక్కనీరు రాదు. సీమ ఎడారి అవుతుంది. సీమలో సాగునీటికే త్రాగునీటికి కూడా ఇబ్బంది కలుగుతుందన్నారు. సీమకు ఇంత నష్టం జరుగుతూ ఉంటే సీమవాసి అయిన ముఖ్యమంత్రి జగన్ నిమ్మకు
నీరెత్తినట్లు ఉండడం దురదృష్టకరం అన్నారు.
ఇప్పటికైనా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) వేసి, సమర్థ వాదనలు వినిపించి ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలుపుదల చేయించాలని తులసి రెడ్డి వైకాపా ప్రభుత్వానికి సూచించారు.
లేకపోతే జగన్ సీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీమ ప్రజలు జగన్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తారని తులసి రెడ్డి హెచ్చరించారు.
మీడియా సమావేశంలో. శ్రీశైలంఅసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి A.S. ఇస్మాయిల్, జరీనా, సుశీలమ్మ, నాగమ్మ ,మంగమ్మ, శీతమ్మ, అశోక్ చింతాల మల్లి. కడప నాయకులు, నరసింహరెడ్డి అమర్ జిరెడ్డి. ఉన్న నాగార్జున పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement