Wednesday, May 1, 2024

AP : చికిత్స పొందుతూ టిటిడి బదిర విద్యార్థి మృతి

తిరుపతి, నవంబరు 26(ప్రభ న్యూస్ ప్రతినిధి)
కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టిటిడి బధిర పాఠశాలకు చెందిన 9వ తరగతి చదివే విద్యార్థి చందు ఆదివారం ఉదయం మృతి చెందారు. గత మంగళవారం అలిపిరి సమీపంలోని బదిర పాఠశాల వసతి గృహంలో స్నేహితులతో ఆడుకుంటూ టర్పెంటైన్ ఆయిల్ నోట్లో పోసుకుని నిప్పు అంటించే క్రమంలో జరిగిన అగ్నిప్రమాదం. ఈ ప్రమాదంలో విద్యార్థి చందు శరీరం దాదాపు 70 శాతం పైగా కాలిపోయింది.

ఈ సంఘటన జరిగాక పాఠశాల సిబ్బంది గాయపడిన చందు ను మొదట తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో విషయం తెలుసుకున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తక్షణమే స్పందించారు. టీటీడీ జేఈవో సదా భార్గవి ద్వారా బాధిత విద్యార్థి చందు ను మెరుగైన వైద్యం కోసం, పక్క రాష్ట్రమైన తమిళనాడులోని వేలూరు సీఎం సి ఆసుపత్రిలో గత బుధవారం అడ్మిట్ చేపించారు. అక్కడ గత ఐదు రోజులుగా ఆసుపత్రి వైద్యులు చందు కి మెరుగైన వైద్య సేవలు అందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ చందు మృతి చెందినట్లు బాదిత కుటుంబ సభ్యులు తెలిపారు. బధిర విద్యార్థి చందు మృతి చెందిన విషయం తెలుసుకున్న టీటీడీ జేఈవో సదా భార్గవి బాధితులతో ఫోన్ ద్వారా పరామర్శించారు. కుటుంబానికి టీటీడీ ద్వారా తాము అండగా ఉంటామని, ఏ కష్టం రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అయితే తమ బిడ్డ మృతికి కారణమైన బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను టిటిడి అధికారులను చంద కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. తమ బిడ్డ ఎలా చనిపోయాడు తమ బిడ్డను ఎవరు కొట్టి బలవంతంగా టర్పెంటైన్ ఆయిల్ తాగించి నిప్పు పెట్టిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తమకు తెలుసన్నారు. పైగా ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు కూడా తమతో మాట్లాడడం జరిగిందని, టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement