Friday, April 26, 2024

శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు.. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి..

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్‌: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఎస్వీ. యూనివర్సిటీ సెనేట్‌ హాల్‌ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలోడి. జి .పి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై నేరాలు హత్యలు వంటి నేరాలు రోడ్డు ప్రమాదాలు గంజాయి వంటి మత్తు పదార్థాలను సరఫరా గడిచిన సంవత్సరంతో పోలిస్తే నిలకడగా ఉన్నాయని వివరించారు.. శాంతి భద్రత పరిరక్షణ విషయంలో మహిళల భద్రత విషయంలో నేరాల నియంత్రణ పోలీస్‌ విభాగం తన వంతు బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నది వివరించారు. అలాగే 20 19. నుంచి 20 21 వరకు నేరాల జాబితాను పరిశీలిస్తే 20 22 ప్రథమ నేరాలు రేటు పెరగలేదని తెలిపారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు అయినా అన్ని చర్యలు చేపట్టడమే కాకుండా అధికారులకు సూచనలు సలహాలను ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ప్రమాదాలలో ప్రాణాంతకమైనవి. ప్రాణాంతకం కానివి రెండు భాగాలుగా విభజించి వాటిని నియంత్రణకు చర్యల పై అధికారులకు సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు.

మహిళల పట్ల నేరాలను నియంత్రణలో దిశా పోలీస్‌ స్టేషన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడంతో పాటు చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దిశ పోలీస్‌ స్టేషన్‌ లో పనితీరు అభినందనీయమన్నారు. అదేవిధంగా ప్రాముఖ్యత కలిగినటు వంటి ఇ కొన్ని నేరాలను దిశ పోలీసులకు అప్పగించడం కూడా జరుగుతుందన్నారు. ఆ నేరాలు పరిశోధన త్వరితగతిన పూర్తిచేయడానికి తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానంగా హత్యలు మహిళలపై అఘాయిత్యాలు ఒంటి పెద్ద నేరాలు జరగడానికి గల కారణాలు. చిన్న చిన్న గొడవలు మనస్పర్థలు పెద్ద నేరాలకు దారితీస్తున్నాయి అన్నారు. ఈ విషయం పలు నేరాల్లో విచారణలో బహిర్గతం అయిందని ప్రాథమిక దశలోనే గొడవలు మనస్పర్థలు వేస్తే పెద్ద నేరాలు జరిగేందుకు అవకాశం ఉండదన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు పెంపకం పంపిణీ అమ్మకం అనే ప్రధాన మూడు విషయాలపై ఆధారపడి ఉందన్నారు. ఇందులో లో రేంజ్‌ ని పెంచడం అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హార్టికల్చర్‌ .అగ్రికల్చర్‌. పోలీస్‌ మూడు విభాగాల సమన్వయంతో గంజాయి ని పెంచే రైతులతో చర్చించి వాటికి ప్రత్యామ్నాయంగా పంతులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు..

సైబర్‌ నేరాలులో ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడే వ్యక్తులు చాల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆచితూచి స్కీన్ప్రై టచ్‌ చేయాలని కేవలం ఈ విషయం పై జరుగుతున్న తొందరపాటు- వల్లనే సైబర్‌ నేరాలు జరుగుతున్నాయన్నారు. పలు రకాల కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పెద్ద నేరస్తులను విడిచిపెడుతూ చిన్న వారిని బలి చేస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అది కేవలం అపోహ మాత్రమే అని నేరాలు జరిగిన వెంటనే ఛార్జ్‌ షీట్‌ వేసి విచారణకు పంపుతున్న మన్నారు. రాష్ట్రంలో నేరాలు రేటు పెరుగుతున్నాయని ఇటీ వల గణాంకాలు వెల్లడిస్తున్నాయి అని అన్న ఈ ప్రశ్నకు సమాధానంగా డిజిపి స్టాటిస్టిక్స్‌ లేకుండా పోలీసు విభాగాన్ని తప్పు పెట్టవద్దని సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పోలీస్‌ విభాగానికి కళంకం తీసుకువచ్చే విధంగా మాట్లాడరాదని కోరారు. ఈ కార్యక్రమంలో హలో అనంతపురం రేంజ్‌ డీఐజీ రవి ప్రకాష్‌, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి, చిత్తూరు ఎస్పీ రి శాంత్‌ రెడ్డి , టాస్క్‌ ఫోర్స్‌ ఎస్పి. సుందర్‌ రావు అదనపు ఎస్పి అడ్మిన్‌ సుప్రజ, లా అండ్‌ ఆర్డర్‌ కులశేఖర్‌, తిరుమల అదనపు ఎస్పి రామయ్య, చిత్తూరు అడిషనల్‌ ఎస్‌ పి శ్రీనివాసరావు తో పాటు రెండు జిల్లాలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement