Monday, April 29, 2024

AP | పొగాకు ఉత్పత్తి పరిమితి 142 మిలియన్‌ కిలోలు.. టుబాకో బోర్డు ఆమోదం

అమరావతి, ఆంధ్రప్రభ: పొగాకు పంట ఉత్పత్తిని 2023-24 సంవత్సరానికి 142 మిలియన్‌ కిలోలుగా టు-బాకో బోర్డు తీర్మానం ఆమోదించింది. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో మంగళవారం బోర్డు చైర్మన్‌ డి.వి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. 2021-22లో 130 మిలియన్‌ కిలోల పరిమితి ఉండగా 2022-23 సీజన్‌ లో 142 మిలియన్‌ కిలోల పరిమితిని విధించారు. మాండోస్‌ తుపాను ప్రభావంతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో అధిక పొగాకు ఉత్పత్తిపై విధించే జరిమానాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎత్తివేసింది. పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని నిర్దారించేందుకు నిర్వహించిన సమావేశంలో పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అద్దంకి శ్రీధర్‌ బాబు, సి.టి.ఆర్‌.ఐ డైరెక్టర్‌ మాగుంట శేషు మాధవ్‌, పొగాకు బోర్డు సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు, అభిమన్యు కుమార్‌, డాక్టర్‌ జి.టి పుత్రా, మద్ది వెంకటేశ్వరరావు, డి.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement