Monday, April 29, 2024

వర్క్ ప్రం హోం ఇవ్వండి.. టీటీడీ ఉద్యోగుల విన్నపం

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కరోనా కేసులతో ఆందోళన చెందుతున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రం కేటాయిస్తూ  వర్క్ ప్రం హోం 50:50 నిష్పత్తిలో విధులు కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు టీటీడీ కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు.

‘’ కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా విస్తరిస్తూ, విజృంభిస్తున్నది. అనేక కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నది. తిరుపతిలోనూ రోజు రోజుకూ కోవిడ్ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు, పెన్షనర్లు కరోనాతో మృతి చెందడం జరిగింది. ఇప్పటికీ పదుల సంఖ్యలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మొదటి సారి కరోనా కాలంలో టీటీడీ యాజమాన్యం ఉద్యోగులకు భరోసా ఇచ్చిన విధంగానే సెకండ్ వేవ్ కరోనాలోనూ ఉద్యోగులకు అండగా ఉండాలని ఆశిస్తున్నాం.

తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. వీరికి సేవలందించే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంఉంది.తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా,ఉద్యోగులరక్షణ దృష్టిలో ఉంచుకొని “వర్క్ ప్రం హోం”చేయగలిగిన వారికి ఇచ్చి,మిగిలిన వారికి 50:50 నిష్పత్తిలో విధులు కేటాయించాలని, అలాగే గతంలోలాగే టిటిడి ఉద్యోగులకు ప్రత్యేకంగా శ్రీనివాసం నందు “కోవిడ్ ఐసోలేషన్”సెంటర్ ను ప్రారంభించాలి’’ అని టిటిడి ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement