Monday, May 6, 2024

Tirumala Brahmotsavas – ఈ నెల 15వ తేది నుంచి శ్రీవారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు……

తిరుమల – ఈ నెల 15వ తేది నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని.. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ పెరిగే అవకాశం వుందని.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.

అక్టోబర్ 19వ తేదీ గరుడ సేవ,20న పుష్పక విమానం,23వ తేదీ జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
సెప్టెంబర్ మాసంలో 21.01 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా..హుండీ ద్వారా 111కోట్ల 65లక్షల ఆదాయం లభించిందన్నారు. కోటి 11లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని..53.84లక్షల మందికీ అన్నప్రసాద వితరణ చేశామన్నారు.8.94 లక్షల మంది తలనీలాలను సమర్పించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement