Tuesday, October 1, 2024

భ‌క్తుల‌తో పోటెత్తిన తిరుమ‌ల‌..

తిరుమ‌ల‌లో భ‌క్తులు పోటెత్తారు.. ప్రస్తుతం విద్యార్థులకు సెలవులు కావడంతో తిరుమల క్షేత్రంలో రద్దీ భారీగా పెరిగింది. టోకెన్లు లేకుండా వచ్చినవారికి స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోగా భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది. ఇకకాలినడకన కొండపైకి వచ్చే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారికి 5-6 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. కాగా, ఊహించ‌ని విధంగా భ‌క్తులు రాక పెర‌గ‌డంతో తిరుమ‌ల కిట‌కిట‌లాడుతున్న‌ది.. గ‌దులు దొర‌క‌క‌ భ‌క్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement