Tuesday, October 8, 2024

Tirumala brahmotsvas – మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేశారు.తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు వరాలు ప్రసాదించారు.

మరోవైపు, విశిష్టమైన శ్రీవారి గరుడవాహనసేవ శుక్రవారం రాత్రి 7 గంటలకు మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. గరుడసేవలో సర్కారు హారతి మాత్రమే ఉంటుంది. ఇతర హారతులు అనుమతించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement