Thursday, May 2, 2024

రాజధానిలో అక్రమ మైనింగ్.. సీఐ కనుసన్నల్లో మాఫియా

రాజధానిలో అక్రమ మైనింగ్ కి తుళ్ళూరు సీఐ సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐ కనుసన్నల్లో మాఫియా కొనసాగుతోంది. ఓ వ్యక్తితో మాఫియా గురించి మాట్లాడుతున్న ఆడియో వెలుగులోకి వచ్చింది. రాత్రి 11-12 గంటలకు తొలుకోండి అని సీఐ మాట్లాడారు. ఒక రాత్రి మొత్తం ఒక్కో ట్రాక్టర్ కి ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. మట్టికి 1000, కంకర 1500, ఇసుక అయితే 2000 పోలీసులకు కట్టి మాఫియా ట్రాక్టర్లు నడుపుతున్నారు. ఇటీవల రాజధానిలో మైనింగ్ మాఫియా విపరీతంగా పెరిగిపోయింది.  అయితే మైనింగ్, రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో సీఐ పేరుతో వైరల్‌ అయిన ఆడియోపై విచారణకు ఆదేశించినట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. రాజధానిలో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను పరిశీలించామన్నారు. సంభాషణపై అదనపు ఎస్పీ స్థాయి అధికారిచే దర్యాప్తు చేస్తామని ఎస్పీ విశాల్ పేర్కొన్నారు. నిజానిజాల బట్టి బాధ్యులపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్ని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement