Thursday, May 2, 2024

10 వేలలోపు పెన్షన్‌ పొందేవారు రేషన్‌ కార్డుకు అర్హులు..

అమరావతి, ఆంధ్రప్రభ : రి-టైర్డు ఉద్యోగులు రూ.10 వేలలోపు పెన్షన్‌ పొందే వారు రేషన్‌ కార్డు తీసుకునేందుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి హెచ్‌ అరుణ్‌ కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. దీంతో ఇప్పుడు రూ.10 వేలలోపు పెన్షన్‌ పొందే వారికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతివ్వడం వల్ల 19,780 మంది కొత్త రేషన్‌కార్డులు పొందేందుకు అర్హత సాధించారు.

రేషన్‌ కార్డు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆరెంచల నిబంధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో కుటు-ంబ ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు కలిగి ఉండాలి. ప్రస్తుతం సిఎఫ్‌ఎంఎస్‌ నుంచి వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆదాయంతో సంబంధం లేకుండా రేషన్‌కార్డును పౌరసరఫరాలశాఖ తిరస్కరిస్తుంది. ఇప్పుడు పెన్షన్‌ రూ.10 వేలలోపు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement