Sunday, May 5, 2024

తిరుపతి..సూట్ కేస్ మర్డర్ లో కీలక ఆధారాలు..

తిరుపతిలో కలకలం రేపిన సూట్ కేసు మర్డర్ లో కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి వెనుక పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించిన శవం కేసును తేల్చారు పోలీసులు. ఇంట్లో భార్యని హత్య చేసి సూట్ కేసులో ప్యాక్ చేసి కారులో మృతదేహాన్ని తెచ్చి రుయా ఆసుపత్రి వెనుక తగులబెట్టినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు సూట్ కేసుని కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు శ్రీకాంత్ రెడ్డికి సహకరించిన టాక్సీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాలు బయటపడ్డాయి. దీంతో పోలీసు జరిపిన విచారణలో బంధువుల వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆడిన డ్రామా వెలుగులోకి వచ్చింది.

తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని… రుయా ఆసుపత్రిలో చేర్చానని… కుటుంబ సభ్యులకు శ్రీకాంత్ రెడ్డి నమ్మించాడు. ఆ తర్వాత భువనేశ్వరి డెల్టా వేరియంట్ తో భార్య చనిపోయిందని వారందరిని నమ్మించాడు. ఇందులో భాగంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు బంధువులకు ఇవ్వడం లేదని కట్టుకథ చెప్పాడు. అంతేకాదు బంధువులను రుయా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలన్నింటినీ వెదికినట్టు ఓ సీన్ క్రియేట్ చేశాడు. అయితే అక్కడ యువతి మృత దేహం లేకపోయే సరికి రుయా సిబ్బంది అంత్యక్రియలు చేసేసారని కుటుంబ సభ్యులని నమ్మించాడు శ్రీకాంత్. అయితే ఆ తర్వాత పోలీసులకు కాలిన మృతదేహం దొరకడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement