Sunday, May 5, 2024

AP | కోతకు గురైన గుండేరు కరకట్ట.. వందలాది ఎకరాల పంటపొలాలు మునక

ఘంటసాల, (ప్ర‌భ‌న్యూస్‌): కృష్ణా జిల్లాలో గుండేరు డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం పరిధిలోని అచ్చెంపాలెం సమీపంలో కోతకు గురైంది. దీంతో వందలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుండేరు డ్రైన్ పొంగి ప్రవహిస్తోంది. పమిడిముక్కల మండలం బుడ్డంకి నుంచి ప్రారంభమైన గుండేరు డ్రైన్.. ఘంటసాల, చల్లపల్లి మండలాల మీదుగా ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది.

- Advertisement -

అధిక వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న గుండేరు డ్రైన్లోని నీరు పారుదల కాకపోవటం, వర్షపు నీటిని గుర్రపు డెక్క, తూటుకాడ అడ్డుగా ఉండటంతో అచ్చెంపాలెం వద్ద కరకట్ట కోతకు గురైంది. సనకా రామారావు చేను వద్ద సుమారుగా 30 నుంచి 40 మీటర్ల వరకు కోతకు గురైనట్లు ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. గుండేరులో ప్రవహిస్తున్న వర్షపు నీరు పొలాల మీద పార‌డంతో అచ్చెంపాలెం, కొడాలి గ్రామాల పరిధిలో ఉన్న వందలాది ఎకరాలు నీటమునిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement