Saturday, May 4, 2024

ఇక భూముల ధరకు రెక్కలు.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై కసరత్తు పూర్తి.. ఈనెల 10వ తేదీలోగా అమల్లోకి..

కర్నూలు, ప్రభన్యూస్ : భూముల విలువ పెంపునకు జిల్లాలో స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ కసరత్తు పూర్తిచేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో రిజిస్ట్రేషన్‌ విలువలు, చార్జీల వడ్డన కానుంది. ఇందుకు జిల్లా కమిటీ నేతృత్వంలో రెండు, మూడు రోజుల్లో ఆమోద కమిటీ ముద్ర వేయనుంది. ఇందులో తక్కువగా 10 నుంచి 15 శాతం ఉండగా, అత్యధికంగా 40 నుంచి 50 శాతం పెంచుతూ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లా విభజనలో భాగంగా నంద్యాల జిల్లాగా ఏర్పడి వాటి ప్రధాన కేంద్రాలు వచ్చేచోట్లతో పాటు జిల్లా అంతటా విలువ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.కమిటీ నుంచి ఆమోద ముద్ర పడగానే ఇక అమలే తరువాయి. జిల్లా కేంద్రంలోనే కాకుండా మొత్తం మీద పెంపుకు సబ్‌ రిజిష్టర్‌లు కసరత్తు పూర్తిచేశారు. ఇప్పటి వరకు ఎక్కడ ఎంతెంత భూమి విలువలున్నాయి. వీటిపై పెంపొందించేందుకు రూపొందించిన ప్రతిపాదనలు ఏమిటీ, పెరుగుదల ఎంత అన్న వివరాలను రూపొందించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్ల నుంచి ప్రతిపాదనలకు ప్రాథమికంగా అనుమతి కూడా తీసుకున్నారు. ఇటీవలే ఈ పనిని పూర్తిచేసిన సబ్‌ రిజిష్టర్‌లు పెరుగుదలకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సెట్లో ఆఫ్‌లోడ్‌ చేస్తున్నారు. ఒకవేళ వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలుంటే స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు.
అనంతరం మార్చి7న అంటే సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో తుది ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత ఏక్షణమైన రిజిస్ట్రేషన్‌ విలువలు పెరగడంతో పాటు చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

10 నుంచి 50 శాతానికి పెరుగుదల..

ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉన్న ప్రతిచోట భూమి విలువలు పెంచుకునేందుకు స్టాంఫ్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత మార్కేట్‌లో చాలచోట్ల భూముల ధరలు ప్రభుత్వం నిర్దేశిత రేటుకు మార్కేట్‌ రేటుకు, 40 నుంచి 50 శాతం వ్యత్యాసం పలుకుతుంది. అంత భారీ రేట్లు పలుకుతున్నప్పుడు ఆదాయం ఎందుకు పెంచుకోకూడదంటూ ప్రభుత్వం స్టాంఫ్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖపై ఒత్తిడి పెంచింది. దీంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో 10 శాతం నుంచి 50 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించారు. అయితే కొన్నిచోట్ల ధరలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని బావించారు. ఈక్రమంలో కర్నూలు నగరంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 శాతం తగ్గించాలని రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులకు సూచించడం జరిగింది. ఆ మేరకు సబ్‌ రిజిష్టర్‌లు సవరణ చేసేందుకు అంగీకరించడం జరిగింది. కొత్త రేట్లపె సోమవారం మరోసారి స్టాంఫ్‌ రిజిష్టర్‌ అధికారులు.. జిల్లా అధికారులతో సమావేశమై పైనల్‌ చేయనున్నారు. ఆ తర్వాత కొత్త రేట్లన్నీ ఆశాఖ వెబ్‌సైట్‌లో ఆఫ్‌లోడ్‌ చేసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా కర్నూలు, పాణ్యం నియోజక వర్గ పరిధిలో భూముల విలువ భారీగా పెంచనుండగా, వీటితో పాటు రిజిస్ట్రేషన్‌ విలువలు, చార్జీల వడ్డన అధికంగా ఉండవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement