Sunday, April 28, 2024

AP: ఏపీ టీడీపీ నేత శివానంద రెడ్డి ఇంటికెళ్లిన‌ తెలంగాణ పోలీసులు..!

తెలంగాణ పోలీసులు ఏపీలో టీడీపీ నేత శివానంద రెడ్డి ఇంటికి వెళ్లారు. నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపిఎస్ శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు. ఈ సందర్బంగా నోటీస్ ఇమ్మని కోరారట శివానంద రెడ్డి. తెలంగాణ పోలీసులు నోటీస్ తయారు చేస్తుండగానే శివానంద రెడ్డి వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయారట.

ఇక టీడీపీ నేత, మాజీ ఐపిఎస్ శివానంద రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ హైదరాబాద్ పోలీసులు. కానీ దొరక్కుండా తప్పించుకొని వెళ్లిపోయారు శివానంద రెడ్డి. హైదరాబాద్ లో భువివాదంలో అరెస్టు చేసేందుకు వచ్చారు సీసీఎస్ పోలీసులు. ఇక ఈ తరుణంలోనే.. పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకున్నాయి టీడీపీ శ్రేణులు. ఈ సంఘటనపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement