Thursday, May 2, 2024

2024లో రాష్ట్రంలో అధికారం టీడీపీదే… మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు

కశింకోట – డిసెంబర్24(ప్రభ న్యూస్):రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు. ఆదివారం మండలంలో తాళ్లపాలెం గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న పప్పల చలపతిరావు ప్రస్తుత రాజకీయాలపై ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడారు.1985లో టిడిపిలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణతో కలిసి పనిచేయడం జరిగిందని,మేము ఇద్దరు ఒక్కేసారి రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అందరినీ కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేయడం అలవాటు అన్నారు. మొదటిలో సీపీఐ,సీపీఎం మరికొన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేసారు.2014లో బీజేపీ, జనసేన పార్టీతో కలిసి విజయం సాధించామని, 2019లో విడిగా పోటి చేసి ఒక్క శాతం ఓట్లతో ఓడిపోవడం జరిగిందన్నారు.

ఇప్పుడు ఆపరిస్థితి రాకుండా జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేస్తుందన్నారు. అయితే అవకాశం ఉంటే బీజేపీతో కూడా కలిసి పోటీ చేస్తారని అడగా కలిసి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు.

ఉమ్మడి జిల్లాలో టీడీపీ అన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందా అడగా? మెజారిటీ స్థానాలు టీడీపీ అవకాశాలు ఉన్నాయని, ఒక్కటి రెండు సీట్లు వైసీపీకీ రావచ్చు అన్ని జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మారుపు కోరుకుంటున్నారని చెప్పారు .యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీకీ టిక్కటే ఎవరికీ అవకాశం ఇవ్వొచ్చు అనీ అడగా ప్రగడ నాగేశ్వరరావు కు ఇవ్వమని పార్టీ అధిష్టానికి చెప్పడం జరిగిందన్నారు.గత రాజకీయాలు వేరు ప్రస్తుత రాజకీయాలు వేరు అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పినట్లు ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో ఉన్నప్పుడు వచ్చిన పదవికి కూడా రాజీనామా చేయాల్సిన చట్టం అవసరమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement