Thursday, May 9, 2024

TDP – ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ రెడీ చేసుకో జ‌గ‌న్ … నారా లోకేష్..

అమ‌రావతి – అవినీతి చక్రవర్తిగా కేటాయించిన ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలంటూ ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కోరారు.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బయట అధికారం చెలాయిస్తున్న జగన్ తొందర్లోనే జైలుకు వెళతారని జ్యోస్యం చెప్పారు.. ఈ మేర‌కు ట్విట్ చేశారు. ఇక జైలుకు వెళ్లే సమయం దగ్గర పడింద‌న్నారు….

అక్రమాస్తుల కేసులో జగన్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. జగన్ తో పాటు సీబీఐకి రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ లోకేష్ తాజాగా జగన్ పై విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా వివిధ కేసులను మేనేజ్ చేస్తూ వచ్చారని, దొంగ సొమ్ముతో వ్యవస్థలను ఇంకెంత కాలం మేనేజ్ చేస్తారని ప్రశ్నించారు. జైలులో ఉండేందుకు సిద్ధంగా ఉండాల‌ని జ‌గ‌న్ కు సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement