Saturday, May 4, 2024

వివేకాను ఎవరు హత్య చేశారో సిబిఐకి తెలుసు: టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి

మాజీ మంత్రి వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐ బహిర్గతం చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి అన్నారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందిన్నారు. హత్యకు సంబంధించి సీబీఐ కూలకుశంగా విచారించాక కూడా ఆ నెపాన్ని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు. సీబీఐకి వైఎస్ కుటుంబంపై ఏమైనా కక్ష ఉంటుందా ? అని ప్రశ్నించారు. వివేకా హత్యను చంద్రబాబుకు చుట్టడం సరికాదున్నారు. వివేకాను ఎవరు హత్య చేశారో సిబిఐ తెలుసు అని, తన ప్రమేయం లేదు కాబట్టి తనను విచారణకు పిలవలేదన్నారు.

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి సహాకారం తీసుకోలేదని చెప్పారు. సీబీఐకి ఇచ్చే వాగ్మూలాలు వెలుగులోకి వస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. వివేకాను హత్య చేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని చెప్పారు. గత మూడేళ్ళుగా రాజధాని వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర ప్రజలను వైసిపి ప్రభుత్వం అయోమయానికి గురి చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ఇకనైనా బుద్ధి మార్చుకోని అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలి హితవు పలికారు. రాజధాని వివాదం వల్లే అభివృద్ధి కుంటుపడిందిని, ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement