Tuesday, May 21, 2024

బిజెపి ఓట‌మితో టిడిపి, జ‌న‌సేన పొత్తుల‌పై అంత‌ర్మ‌థ‌నం…

అమరావతి, ఆంధ్రప్రభ : కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో ఈసారి తెలుగు ఓటర్లు అక్కడ ఎవరికి మద్దతు ఇచ్చార నేది ఆసక్తి కర అంశంగా మారింది. దీంతో ఏపీలో బీజేపీతో పొత్తుకు సిద్ధమౌతున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పుడు ఎలా వ్యవహ రించాలన్నదానిపై కుస్తీపట్లు పడుతున్నాయి. అక్కడ వెలువడిన ఫలితాలే ఏపీలోనూ వెలువడే అవకాశ మున్న నేపథ్యంలో బీజేపీకి దూరంగా ఉండాలా..లేక దగ్గరగా ఉంటూ ఏదైతే అదవుతుందన్న చందంగా వ్యవహరించాలా అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. రాజకీయాల్లో హత్యలుండవని, కేవలం ఆత్మహత్యలే ఉంటాయన్ననానుడి తెలిసి కూడా బీజేపీ ప్రజా వ్యతిరేకత ఉండి ఉండి తామెందుకు అంటించుకోవాలన్న ఆలోచన చేస్తేబాగుంటుందన్న అభిప్రాయన్ని ఈ రెండు పార్టీల్లోని కొంత మంది సీనియర్లు వ్యక్తంచేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించాక ఇప్పటి వరకూ విభజన హామీలు నెరవేర్చడంగానీ, ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్‌, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, లోటు బడ్జెట్‌, ఇరు రాష్ట్రాల ఆస్థుల పంపకం, జల వివాదాల పరిష్కారం ఇలా ఏ ఒక్క అంశంలోనూ బీజేపీ పెద్దలు సూటిగా, స్పష్టంగా వ్యవహరించి పరిష్కరించిన దాఖలాలు లేవు. ఇక విభజన హామీల సంగతైతే వేరే చెప్పాల్సిన పనిలేకుండా పోయింది. ఈనేపథ్యంలో అడుగుడుగునా ఆంధ్రరాష్ట్రానికి మొండిచేయి చూపిన బీజేపీ చివరకు బడ్జెట్‌లో కూడా ఏపీకి అదే మొండి చేయి చూపింది.ఏపీ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజ ల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం ఏమేరకు శ్రేయస్కరమన్నదానిపై అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీలు పునరాలోచనలు పడినట్లుగా తెలుస్తోంది.

అక్కడ కూడా మనమే డిసైండిగ్‌ ఫ్యాక్టర్‌
కర్ణాటకలో 12 జిల్లాల్లో తెలుగు ప్రజలు డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. ఆ రాష్ట్రంలో 15 శాతం తెలుగు వారే. 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసారు. ఈ 12 జిల్లాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు ఏ పార్టీని గెలపించారు..ఎవరిని ఓడించారనే అంశం పైన ఆసక్తి కర ఫలితాలు వెల్లడవుతున్నాయి. కర్ణాటకలోని బళ్లారి, కోలార్‌, బెంగళూరు రూరల్‌, బెంగళూరు అర్బన్‌, రాయచూర్‌, కొప్పల, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబల్లాపురా, యాదగిరి, బీదర్‌, కాలబురగి జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన తెలుగు ఓటర్లు ఎక్కువ. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఓటర్ల సంఖ్యకు మించి వీరి ఓటర్ల సంఖ్య ఉంది. కోలార్‌ జిల్లాల్లో ఎక్కువ శాతం ఓటర్లు తెలుగు ప్రజలే. వీరు ఆజిల్లాలోని 6 నియోజకవర్గాలను బలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే బెంగళూరు రూరల్‌, బెంగళూరు అర్బన్‌ పరిధిలోనూ తెలుగు ఓట్లర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరు 25 నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ప్రభావితం చేసారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఫలితాలు ఆసక్తి కరంగా ఉన్నాయి.

బీజేపీకి వ్యతిరేకంగా
తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఫలితాలు పూర్తిగా కాంగ్రె స్‌కు అనుకూలంగా ఉన్నాయి. తెలుగు ఓట ర్లు డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉన్న ఎనిమిది జిల్లాల్లోని నియోజకవర్గాలను పరిశీలిస్తే 43 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలవగా, 27 నియోజకవర్గాల్లో బీజేపీ విసయం సాధించింది. యాదగిరి జిల్లాలో బీజేపీకి ఒక్క సీటు- రాలేదు. అక్కడ కాంగ్రెస్‌ 3, జేడీఎస్‌ 1 గెలుచుకున్నాయి. రాయచూర్‌లో బీజేపీకి 2, కాంగ్రెస్‌ 4, జేడీఎస్‌ 1 స్థానం గెలుచుకున్నాయి. బీదర్‌లో బీజేపీకి 4, కాంగ్రెస్‌ 2 సీట్లు- సాధించింది. కోలార్‌లో కాంగ్రెస్‌కు 4, జేడీఎస్‌కు 2 సీట్లు- వచ్చాయి. బళ్లారిలో బీజేపీకి ఒక్క స్థానం రాలేదు. కాంగ్రెస్‌ 5 చోట్ల గెలుపొందింది. చిక్‌ బళ్లాపూర్‌లో బీజేపీకి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్‌ 4, జేడీఎస్‌ కు 2 సీట్లు- వచ్చాయి.

పొత్తులపై ప్రభావం:
బెంగళూరు అర్బన్‌లో 28 స్థానాలు ఉండగా బీజేపీకి 15, కాంగ్రెస్‌కు 13 సీట్లు- వచ్చాయి. బెంగళూ రు రూరల్‌లో బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 1, జేడీఎస్‌కు 3 స్థానాలు దక్కాయి. తుముకూరులో బీజేపీకి 2, కాంగ్రెస్‌కు 7, జేడీఎస్‌కు 2 సీట్లు- దక్కాయి. దీంతో, ఇప్పుడు తెలుగు ఓటర్లు ప్రభావం చూపే నియోజక వర్గాల్లో బీజేపీ ఓడిపోవటంతో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ – జనసేన బీజేపీతో కలిసి పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ఫలితాలు ప్రజల నాడిని స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. మరి..కాంగ్రెస్‌ ను గెలిపించి.. బీజేపీని ఓడించిన తెలుగు ఓటర్ల తీర్పును తెలుగు రాష్ట్రా ల్లోని పార్టీలు ఏ రకంగా స్వీకరిస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement