Monday, April 29, 2024

Kuppam Results: చంద్రబాబుకు ఊహించని ఓటమి.. కుప్పంలో వైసీపీ విజయం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో టీడీపీకి షాక్ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అంచనాలను వైసీపీ తలకిందులు చేసింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన అధికార వైసీపీ.. కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. కుప్పంలో 25 వార్డులు ఉండగా.. ఇందులో ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 24 వార్డులకు ఈ నెల 15న ఎన్నికలు జరిగాయి. తొలి రౌండ్‌లో 15 వార్డుల కౌంటింగ్ ముగిసింది. ఇప్పటికే 14 వార్డు ఏకగ్రీవం కాగా.. మిగిలిన వార్డుల్లో లెక్కించారు. మొత్తం 14 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 12, టీడీపీ 2 వార్డులు గెలుచుకుంది. 1,2,3,4,6,7,8,9,10,12,13,15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 5,11 వార్డుల్లో టీడీపీ గెలిచింది. కుప్పంలో విజయం సాధించడంతో.. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

1వార్డులో టీడీపీ 374,  వైసీపీ 1028, 2వ వార్డులో టీడీపీకి 455,  వైసీపీకి 807, 3వ వార్డు టీడీపీ 497, వైసీపీ 595, 4వ వార్డులో టీడీపీ 498, వైసీపీ 713, 8వ వార్డు టీడీపీ 419, వైసీపీ 695, 9వ టీడీపీ 711, వైసీపీ  788, 10వ వార్డులో వైసీపీకి 419 వైసీపీకి 695, 12వార్డులో టీడీపీ 554, వైసీపీ 742, 13వ వార్డు టీడీపీకి 506, వైసీపీకి 621, 15వ వార్డులో టీడీపీకి 518, వైసీపీకి 981 ఓట్లు వచ్చాయి.

గతంలో జరిగిన పంచాయతీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కుప్పం పరిధిలో టీడీపీకి వైసీపీ షాకిచ్చింది. ఇప్పుడు అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీకి వైసీపీ ఝలక్ ఇచ్చింది. కుప్పంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. అయితే చంద్రబాబు నియోజకవర్గంలో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. ఆ విషయంలో విజయం సాధించింది.

ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల ముందు నుంచే కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ 2014తో పోలిస్తే దాదాపు 14 వేలు తగ్గింది. టీడీపీకి కంచు కోటా అయిన కుప్పంలో వైసీపీ గెలవడంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరేస్తామని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement