Monday, April 29, 2024

Big Story: షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్‌.. యువ‌త‌కు ఉపాధి, సర్కారుకు డ‌బుల్ ఇన్‌క‌మ్..

What an Idea: ఉన్న వ‌న‌రుల‌ను వినియోగించుకుని ఆర్థికలోటును పూడ్చుకుని స‌స్టైన్ కావ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.. ఎక్క‌డ పోగొట్టుకున్నామో.. అక్క‌డే వెతుక్కోవాల‌న్న విధానాన్ని సీఎం జ‌గ‌న్ అమ‌ల్లో పెడుతున్నారు. అందులో భాగంగా ఏపీకి ఏటా తీవ్ర న‌ష్టాల‌ను తెచ్చే కోస్ట‌ల్ బెల్ట్‌ను ఆదాయ వ‌న‌రుగా మ‌లుచుకునేందుకు మ‌రో ప్ర‌య‌త్నం ఏపీ స‌ర్కారు చేస్తోంది.

దేశంలో అత్యంత ఎక్కువ తీరప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్ర‌మే. అయితే తీరం బేస్‌గా ఇన్‌క‌మ్‌తోపాటు జాబ్ ఆప‌ర్చునిటీస్ పెంచుకునేందుకు ఏపీ మారిటైమ్ బోర్డ్ ప్లాన్ చేస్తోంది. కొత్తగా షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఓ వైపు సముద్రం, మరోవైపు నదులు, ఇంకోవైపు అటవీ ప్రాంతం ఉంటుంది.

అయితే.. సుదీర్ఘమైన తీరప్రాంతాన్ని బేస్ చేసుకుని ఇన్‌క‌మ్ సోర్స్ ఎట్లా పొందాల‌నే ఆలోచ‌న‌లో ఏపీ మారిటైమ్ బోర్డు ఉంది. తూర్పు తీరప్రాంతంలో షిప్ రిపేరింగ్ యూనిట్ ఒక్కటి కూడా లేకపోవడంతో ఆ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని బోర్డు ప్లాన్ చేసింది. మారిటైమ్ ఇండియా విజన్ 2030లో భాగంగా షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాల‌ని ఏపీ మారిటైమ్ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది.

ఈ క్లస్టర్‌కు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు అనుకూలంగా ఉన్నాయని ఆ ప్ర‌తిపాద‌న‌ల్లో మారిటైమ్ ఇండియా విజ‌న్ బోర్డు తెలిపింది. దీర్ఘకాలిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశాన్ని సద్వినియోదం చేయాలని కేంద్ర ఓడరేవుల మంత్రి శర్వానంద్ సోనోవాల్‌ను కోరింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ముందు ఏపీ మారిటైమ్ అధికారులు ఈ ప్రతిపాదన ఉంచారు.

షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్ యూనిట్ ఏర్పాటుతో ఏపీలో ప్రత్యక్షంగా 15 వేలమందికి, ప‌రోక్షంగా మ‌రో 20వేల మందికి ఉపాధి క‌ల్పించ‌వ‌చ్చ‌ని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనావేసింది. ఒక షిప్‌ను రీ సైక్లింగ్ చేసేందుకు సగటున 300 మంది స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరముంటుంది. ఈ యూనిట్‌పై ఆధారపడి దాదాపు 50 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కానున్నాయనేది మరో అంచనా.

- Advertisement -

అంతేకాకుండా పది లక్షల టన్నుల ఉక్కును తుక్కుగా మార్చి అమ్మితే జీఎస్టీ రూపంలో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి 270కోట్ల ఇన్‌క‌మ్ వ‌స్తుంద‌న్న‌ది కూడా మ‌రో అంచ‌నాగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వెయ్యికి పైగా ఓడలు రీ సైక్లింగ్ అవుతున్న‌ట్టు ఈ బోర్డు త‌మ అంచ‌నాలో పేర్కొంది. ఇప్పటి వరకూ రీ సైక్లింగ్ వ్యాపారంలో గుజరాత్ ముందంజలో ఉంది. ఈ అవకాశాన్ని తూర్పు తీర ప్రాంతంలో అందిపుచ్చుకునేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం తీవ్రంగానే కృషి చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

ఇది కూడా చదవండి: Municipal Elections Results : ఫలితాల్లో వైసీపీ హవా… అక్కడ టీడీపీ జయకేతం

Advertisement

తాజా వార్తలు

Advertisement